SS Rajamouli and Keeravani Special Awareness Song on Present Issue
#stayathome
Music Director MM Keeravani Awareness Song On Coronavirus | Request CP Sajjanar IPS *కోవిడ్ నివారణకు ప్రోత్సాహ గీతాన్ని విడుదల చేసిన సీపీ* #MMKeeravani #CPSajjanarIPS #coronavirus #LockDown #COVID-19 #TeluguGoldenTV #FightAgainstCoronaVirus - కోవిడ్ పై ఎం.ఎం. కీరవాణి స్వరపర్చిన పాట - ఎం.ఎం. కీరవాణిని అభినందించిన సీపీ - ఆలోచింపజేసే గీతాన్ని రచించిన సీపీ గారి పీఏ శ్రీధర్ కు సీపీ గారి అభినందన సైబరాబాద్ : ప్రముఖ చలనచిత్ర సంగీతద ర్శకుడు, గాయకుడు కోడూరి మరకతమణి (ఎం.ఎం.) కీరవాణి కోవిడ్ 19 కరోనా నివారణకు కృషి చేస్తున్న వివిధ శాఖలైన వైద్యులు, పోలీసులు, మీడియా, పారిశుధ్య కార్మికులను వారి సేవలను కొనియాడుతూ సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., గారి పీఏ శ్రీధర్ గవ్వల రచించిన గీతాన్ని, సమన్వయపరిచి స్వయంగా పాడిన '' నీ ప్రాణాలు ఫణమొడ్డి ప్రాణాలు నిలబెట్టి ప్రజా వైద్యులారా’’ అనే పాటను ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., చేతుల మీదుగా ఆడియో సీడీని లాంచ్ చేశారు. అనంతరం ఈ పాటను సైబరాబాద్ యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ లో అప్ లోడ్ చేశారు. గీతాన్ని అభినందిస్తూ పాటను రాసిన సంగీతదర్శకుడు, గాయకుడు కోడూరి ఎం.ఎం.కీరవాణి సీపీ గారు అభినందించారు. సీడీ ఆవిష్కరణలో సీపీ గారి వెంట సినీ సంగీత దర్శకుడు ఎం. ఎం కీరవాణి, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్ విజయ్ కుమార్, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణీ ప్రియదర్శినీ, కీరవాణి కుమారులు శ్రీసింహ, కాలభైరవ, ఐటీ ఇన్ స్పెక్టర్ రవీంద్రప్రసాద్ ఉన్నారు. ............................. నీ ప్రాణాలు ఫణమొడ్డి ప్రాణాలు నిలబెట్టి ప్రజా వైద్యులారా మేము వేసిన చెత్త మీ చేతులతో ఎత్తే సపాయి తల్లులారా సూర్యచంద్రుల సాడి పొద్దు తోటి పోటి రక్షకభటులారా వార్తలెన్నో మోసి ప్రజల ముందు ఉంచే మీడియా మిత్రులారా దేవుండ్లంతా కలిసి మీ రూపాలల్లో తిరుగుతున్నరమ్మా మీ సేవల పుణ్యాన జగమంత మరుజన్మ ఎత్తుతున్నదమ్మా ఎంత పొగిడిన ఏమి ఇచ్చిన మీ రుణం ఎట్ల తీర్చుకుందుము మరుజన్మ అనేది మళ్లొక్కటి మాకుంటే మీ కొలువు మేం జేతుము